రైతుల ఉసురు తగులుతుంది: షేక్‌ ముంతాజ్‌

ABN , First Publish Date - 2020-10-31T07:00:29+05:30 IST

అమరావతిలో రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల భూములు ఇచ్చిన రైతుల ఉసురు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి తగులుతుందని టీడీపీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు షేక్‌ ముంతాజ్‌ అన్నారు.

రైతుల ఉసురు తగులుతుంది: షేక్‌ ముంతాజ్‌

 అమరావతి రైతులకు సంకెళ్లు వేసినందుకు నిరసన


కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 30:  అమరావతిలో రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల భూములు ఇచ్చిన  రైతుల ఉసురు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి తగులుతుందని టీడీపీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు షేక్‌ ముంతాజ్‌ అన్నారు.  వైసీపీ ప్రభుత్వం అమరావతి రైతులపై కక్ష సాధిస్తోందని అన్నారు. అమరావతి రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో  కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. అనంతరం చేతులకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్భంగా షేక్‌ ముంతాజ్‌ మాట్లాడుతూ రైతులకు అన్యాయం చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని అన్నారు.  సీఎం జగన్‌ కళ్లు తెరిచి అమ రావతిలోనే రాజధానిని ఏర్పాటు చేసేలా  నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే అమరావతి ఆందోళనలు  రాష్ట్ర వ్యాప్తమ వుతాయని అన్నారు. రైతుల ప్రయో జనాలను అడ్డుకునే పాలకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. కార్యక్రమంలో పోతురాజు రవికుమార్‌, హనుమంతరావు చౌదరి, నాగేంద్రకుమార్‌, షేక్‌ సమీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more