బీసీకి మాతృవియోగం

ABN , First Publish Date - 2020-10-28T08:50:14+05:30 IST

బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మాతృమూర్తి లక్ష్మమ్మ (85) అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటలకు మృతి చెందారు.

బీసీకి మాతృవియోగం

బనగానపల్ల్లె, అక్టోబరు 27: బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మాతృమూర్తి లక్ష్మమ్మ (85) అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున 5.30 గంటలకు మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బనగానపల్లెలో ఇంటి వద్దే డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందించారు. ఆమె కోలుకోలేక మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే నియోజకవర్గంలోని మిత్రులు, సన్నిహితులు, బంధువులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బీసీ ఇంటికి వచ్చి బీసీ సంతాపం వ్యక్తం చేశారు.


జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల పార్లమెంటరీ ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి, కోవెలకుంట్ల మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ సుంకిరెడ్డి, గడ్డం నాగేశ్వరరెడ్డి, తెలుగు రాష్ట్ర రైతు అధ్యక్షుడు గడ్డం రామకృష్ణారెడ్డి, బనగానపల్లె మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ కోడి నాగరాజుయాదవ్‌, నందవరం ఆలయ మాజీ చైర్మన్‌ పీవీ కుమార్‌రెడ్డి, యాగంటి ఆలయ మాజీ చైర్మన్‌ బత్తుల బాలిరెడ్డి, జిల్లా మైనారిటీ టీడీపీ అధ్యక్షుడు జాహీద్‌హుస్సేన్‌ తదితరులు హాజరయ్యారు. 

Updated Date - 2020-10-28T08:50:14+05:30 IST