నేడు మాళమల్లేశ్వరస్వామి రథోత్సవం

ABN , First Publish Date - 2020-10-28T08:48:28+05:30 IST

దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి రథోత్సవం బుధవారం నిర్వహించనున్నారు.

నేడు మాళమల్లేశ్వరస్వామి రథోత్సవం

ఆలూరు రూరల్‌(హొళగుంద), అక్టోబరు 27: దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి రథోత్సవం బుధవారం నిర్వహించనున్నారు. ఉదయం స్వామికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, రథసంస్కారం, రథాంగహోమం, బండారు అర్చన, మహామంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. సాయంత్రం జరిగే రథోత్సవానికి ఆంధ్ర, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. దేవరగట్టులో 29న ఉదయం గొరవయ్య ఆటలు, గొలుసు తెంపుట, సాయంత్రం దేవదాసీల క్రీడోత్సవం, వసంతోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 30న మల్లేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా నెరణికి గ్రామానికి చేరుకోవడంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 

Updated Date - 2020-10-28T08:48:28+05:30 IST