నది దాటి.. బడికి

ABN , First Publish Date - 2020-10-13T08:52:26+05:30 IST

హంద్రీ నదిలో ఈదుతున్న ఈయన పేరు లక్ష్మన్న. కోడుమూరు మండల పరిధిలోని ఎర్రగుడి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. గోరంట్ల నుంచి విధులు నిర్వహించేందుకు రోజూ నది దాటి వెళ్లి వస్తుంటాడు.

నది దాటి.. బడికి

కోడుమూరు (రూరల్‌), అక్టోబరు 12: హంద్రీ నదిలో ఈదుతున్న ఈయన పేరు లక్ష్మన్న. కోడుమూరు మండల పరిధిలోని ఎర్రగుడి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. గోరంట్ల నుంచి విధులు నిర్వహించేందుకు రోజూ నది దాటి వెళ్లి వస్తుంటాడు. ఈయన ఒక్కరే కాదు.. హంద్రీనది అవతలి ఒడ్డున ఉన్న కొత్తపల్లి, ఎర్రగుడి గ్రామాలకు ఎవరు వెళ్లాలన్నా ఇదే పరిస్థితి.


నదిలో నీరు లేనప్పుడు ఏ సమస్యా ఉండదు. కానీ వర్షాకాలంలో మాత్రం ఇలా ఈత కొట్టాల్సిందే. చిన్నా చితక పనులు ఉంటే ప్రయాణం వాయిదా వేసుకుంటారు. కానీ ఆ గ్రామాల్లో ఉద్యోగాలు నిర్వహించేవారు మాత్రం సాహసం చేసి ఒడ్డుకు చేరుతుంటారు. లేదంటే 30 కిలో మీటర్లు చుట్టూ తిరిగి వాహనాల్లో రావాల్సి ఉంటుంది. బ్రిడ్జి నిర్మిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. 

Updated Date - 2020-10-13T08:52:26+05:30 IST