దళితులపై దాడులు అరికట్టాలి’

ABN , First Publish Date - 2020-10-12T11:53:13+05:30 IST

దేశ వ్యాప్తంగా దళితులు, మహిళలపైన జరుగుతున్న దాడులను, అత్యాచారాలను అరికట్టాలని నంద్యాల ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు.

దళితులపై దాడులు అరికట్టాలి’

నంద్యాల, అక్టోబరు 11: దేశ వ్యాప్తంగా దళితులు, మహిళలపైన జరుగుతున్న దాడులను, అత్యాచారాలను అరికట్టాలని నంద్యాల ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం సీపీఎం నరసింహయ్య భవన్‌లో ప్రజా సంఘాల ఐక్యవేదిక రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌, సీఐటీయు జిల్లా కార్యదర్శి నాగరాజు, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హుసేన్‌బాషా, ఐద్వా జిల్లా కార్యదర్శి రత్నమ్మ, కులవివక్ష పోరాట సమితి నాయకులు అల్పోనెన్స్‌ మాట్లాడారు.


మహిళలపై అత్యాచారాలు, దళితులపై దాడులను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మంగళవారం దేశ వ్యాప్తంగా ప్రజాసంఘాలు నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించబోతున్నాయని, జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ప్రజా సంఘాల ముఖ్య నాయకులు సద్దాం హుసే న్‌, పుల ్లనరసింహులు, రాజేష్‌, శివ, ఓబులేసు, ఈశ్వరి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-12T11:53:13+05:30 IST