ఆలయాల వద్ద నిఘా ఉంచండి: డీఎస్పీ

ABN , First Publish Date - 2020-10-07T08:26:59+05:30 IST

ఆలయాల వద్ద నిఘా ఉంచాలని నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి సూచించారు.

ఆలయాల వద్ద నిఘా ఉంచండి: డీఎస్పీ

గడివేముల, అక్టోబరు 6: ఆలయాల వద్ద నిఘా ఉంచాలని నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి సూచించారు. మంగళవారం ఆయన దుర్గాభోగేశ్వర ఆలయాన్ని పరిశీలించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. పాణ్యం సీఐ జీవన్‌ గంగనాథ్‌బాబు, ఎస్‌ఐ సుబ్బరామిరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శ్యామ్‌సుందర్‌శర్మ, ఆలయ సిబ్బంది వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


పాణ్యం: ఆలయాల భద్రతపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని కొత్తూరు సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం, పాణ్యం ఎస్సార్బీసీ కాలనీలోని వెకటేశ్వర దేవాలయం, రసూళ్ల పేటలోని సుంకులా పరమేశ్వరీ ఆలయాలను పరిశీలించారు. అనంతరం డీఎస్పీని ఆలయ మర్యాదలతో సన్మానించారు. పాణ్యం ఎస్‌ఐ రాకేష్‌, ఆలయ ఈవె రామకృష్ణ, సిబ్బంది సుబ్బారెడ్డి, ప్రసాదు, అర్చకులు సురేష్‌శర్మ పాల్గొన్నారు.

Read more