శ్రీశైలంలో కుమార విహారం నిర్మించడం తగదు’

ABN , First Publish Date - 2020-10-07T08:25:44+05:30 IST

శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారి ప్రధాన ఆలయం వెనుక మరొక ఆలయం నిర్మించకూడదని ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన జంగమ సమాజం సభ్యులు ఆందోళన చేశారు.

శ్రీశైలంలో కుమార విహారం నిర్మించడం తగదు’

కర్నూలు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారి ప్రధాన ఆలయం వెనుక మరొక ఆలయం నిర్మించకూడదని ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన జంగమ సమాజం సభ్యులు ఆందోళన చేశారు. శ్రీశైలం మహాక్షేత్రంలో కుమార విహారం పేరుతో నిర్మించబోయే కుమార స్వామి ఆలయంపై అభ్యంతరాలను తెలిపే చర్చా కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైలం ఎమ్మేల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవస్థాన ఈవో కేఎస్‌ రామరావు విచ్చేశారు.


శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారి ప్రధాన ఆలయానికి వెనుక కుమార స్వామి ఆలయం ఉందని, ఇపుడు కొత్తగా మరొక ఆలయం నిర్మించడానికి వీలులేదని అన్నారు. అలా కాదని ఆలయాన్ని నిర్మిస్తే స్వామి వారి ప్రతిష్ఠ దిగజారుతుందని సమాజ సభ్యులు అన్నారు. ఒకవేళ ఆలయాన్ని నిర్మించాలనుకుంటే దోర్నాలలో గాని, త్రిపురాంతకంలో గాని నిర్మించుకోవచ్చని, శ్రీశైలంలో నిర్మించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

Read more