16 నుంచి మొక్కజొన్న, సజ్జల కొనుగోలు

ABN , First Publish Date - 2020-10-07T08:21:58+05:30 IST

జిల్లాలో రైతుల నుంచి మొక్కజొన్న, సజ్జల కొనుగోలు ఈనెల 16 నుంచి చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ రవి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

16 నుంచి  మొక్కజొన్న, సజ్జల కొనుగోలు

కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 6: జిల్లాలో రైతుల నుంచి మొక్కజొన్న, సజ్జల కొనుగోలు ఈనెల 16 నుంచి చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ రవి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మొక్కజొన్నకు ప్రభుత్వం క్వింటానికి రూ.1850, సజ్జలకు క్వింటానికి రూ.2,150 మద్దతు ధరను ప్రకటించింది. అయితే వ్యాపారులు మార్కెట్లో రూ.500 తక్కువ చేసి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. మార్కెటింగ్‌శాఖ అధికారుల నివేదికపై ప్రభుత్వం స్పందించింది.


వెంటనే మొక్కజొన్న, సజ్జల కొనుగోలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జాయింట్‌ కలెక్టర్‌ రవి డీఆర్‌డీఏ, ఐకేసీ సిబ్బంది, మార్క్‌ఫెడ్‌ అధికారులతో రెండు రోజుల క్రితం సమావేశమై చర్చించారు. ఈ నెల 1 నుంచి 15వ తేదీ వరకు గ్రామాల్లోని రైతుభరోసా కేంద్రాల్లో మొక్కజొన్న, సజ్జలు సాగు చేసిన రైతులు పేర్లు నమోదు చేసుకోవాలని, 16వ తేదీ నుంచి కొనుగోళ్లు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు. 

Updated Date - 2020-10-07T08:21:58+05:30 IST