ఆన్‌లైన్‌ మోసం

ABN , First Publish Date - 2020-10-04T09:20:26+05:30 IST

పట్టణంలో ఓ యువకుడు ఆన్‌లైన్‌ మోసానికి గురయ్యాడు. రూ.87,500 పోగొట్టుకున్నాడు.

ఆన్‌లైన్‌ మోసం

ఎస్‌బీఐ సర్వీస్‌ సెంటర్‌ ఇప్పిస్తానని..


ఆదోని, అక్టోబరు 3: పట్టణంలో ఓ యువకుడు ఆన్‌లైన్‌ మోసానికి గురయ్యాడు. రూ.87,500 పోగొట్టుకున్నాడు. త్రీటౌన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ నారాయణస్వామి తెలిపిన వివరాల మేరకు, పట్టణంలోని కార్వన్‌ పేటకు చెందిన మహేష్‌కు జూలై 27న ఓ వ్యక్తి ఎస్‌బీఐ కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌ ఇస్తామని నమ్మబలికాడు. సెంటర్‌ను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుదామన్న ఆశతో ఆ వ్యక్తికి పది విడతలుగా రూ.87,500 ఆన్‌లైన్‌ ద్వారా పంపించాడు. ఆ తరువాత సర్వీస్‌ సెంటర్‌ ఇప్పిస్తామన్న వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి చిరునామా తెలియకపోవడం, ఫోన్‌ నెంబర్‌ పనిచేయడంతో బాధితుడు త్రీటౌన్‌ పోలీసులను ఆశ్రయించాడు. జగదీష్‌ అనే వ్యక్తితో పాటు మరి కొందరిపై అనుమానం ఉన్నట్తు తెలపడంతో కేసు నమోదు చేశామని హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపారు. 

Updated Date - 2020-10-04T09:20:26+05:30 IST