ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక మృతి

ABN , First Publish Date - 2020-10-03T11:01:25+05:30 IST

ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందింది. ఎస్‌ రామాంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దొర్నిపాడు గ్రామానికి చెందిన పవిత్ర (12)ను అదే గ్రామానికి చెందిన సురేష్‌ అనే యువకుడు బాలికను వేధిస్తుండటంతో సెప్టెంబరు 19న ఇంట్లో పురుగుల మందు తాగింది.

ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక మృతి

యువకుడి వేధింపుల తాళలేక..

దొర్నిపాడు, అక్టోబరు 2: ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక చికిత్స పొందుతూ కోలుకోలేక మృతిచెందింది. ఎస్‌ రామాంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దొర్నిపాడు గ్రామానికి చెందిన పవిత్ర (12)ను అదే గ్రామానికి చెందిన సురేష్‌ అనే యువకుడు బాలికను వేధిస్తుండటంతో సెప్టెంబరు 19న ఇంట్లో పురుగుల మందు తాగింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రలు ఆళ్లగడ్డ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నంద్యాల వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతి చెందింది. బాలిక తండ్రి సుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2020-10-03T11:01:25+05:30 IST