రామాయణం మన జీవితంతో భాగం

ABN , First Publish Date - 2020-10-03T10:45:56+05:30 IST

రామాయణాన్ని ఒక గ్రంథంలా చూడకూడదని, అది మన దేశ ప్రజల జీవితంలో భాగమని సిల్వర్‌ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీవీ సుబ్రహ్మణ్య కుమార్‌ అన్నారు.

రామాయణం మన జీవితంతో భాగం

సిల్వర్‌జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్‌

కర్నూలు (కల్చరల్‌), అక్టోబరు 2: రామాయణాన్ని ఒక గ్రంథంలా చూడకూడదని, అది మన దేశ ప్రజల జీవితంలో భాగమని సిల్వర్‌ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీవీ సుబ్రహ్మణ్య కుమార్‌ అన్నారు. సిల్వర్‌ జూబ్లీ కళాశాల తెలుగు అధ్యయన శాఖ, నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం (నరసం) సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ‘రామాయణం-విశ్వమానవ వికాసం’ అనే అంశంపై రెండు రోజుల అంత ర్జాతీయ అంతర్జాల సదస్సు ఆరంభమైంది.

ఈ సదస్సును నరసం రాష్ట్ర అధ్యక్షురాలు కావెం సుబ్బలక్ష్మమ్మ ప్రారంభించగా, సదస్సుకు ఆన్‌లైన్‌లో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీవీ సుబ్రహ్మణ్య కుమార్‌ అధ్యక్షత వహించారు. కళాశాల తెలుగుశాఖ అధ్యక్షురాలు డాక్టర్‌ దండెబోయిన పార్వతీదేవి, తేళ్ల అరుణకుమారి, కేవీ సుబ్బలక్ష్మి, మారుతి కు మారి, సేతలక్ష్మి, సునీత జ్యోత్స్న, పార్వతి, ఎలమర్తి రమణయ్య, ఎమలర్మి సూర్యశ్రీ పాల్గొన్నారు.


వీవీ సుబ్రహ్మణ్య కుమార్‌ మాట్లాడుతూ రామాయణంలోని ప్రతి ఒక్క అంశమూ భారతీయ జీవన విధానాన్ని, సమాజాన్ని, నడవడికను సూచిస్తుందని చెప్పారు.తొలిరోజు సదస్సులో రామాయణ గ్రంథంలోని బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండలను వక్తలు డాక్టర్‌ ఎం. ప్రపుల్లత, నందివెలుగు ముక్తేశ్వరరావు, మావుడూరు సూర్యనారాయణ శాస్త్రిలు పలు ఉదాహారణల మధ్య వివరించారు.  డాక్టర్‌ దేవికారాణి, జేఎ్‌సఆర్‌కే శర్మ, శ్యామసుందర శాస్త్రి, డాక్టర్‌ మారుమాముల దత్తాత్రేయ శర్మ  పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T10:45:56+05:30 IST