పొలంలోనే పురుగుమందు తాగి.
ABN , First Publish Date - 2020-10-03T10:37:28+05:30 IST
వ్యవసాయంలో ఏటా నష్టాలు రావడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని రాంకొండ గ్రామంలో జరిగింది.
రాంకొండలో రైతు ఆత్మహత్య
తుగ్గలి, అక్టోబరు 2: వ్యవసాయంలో ఏటా నష్టాలు రావడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని రాంకొండ గ్రామంలో జరిగింది. రైతు సురేష్(35)కు 2 ఎకరాల సొంత పొలం ఉంది. మరో 10 ఎకరాలు కౌలు చేసుకుని సాగు చేస్తున్నాడు. ప్రతి ఏటా నష్టాలు రావడంతో అప్పులు రూ.7.50లక్షలకు చేరుకున్నాయి.
ఈ ఏడాది కూడా పంటలు అతివృష్ఠితో కుళ్లిపోయాయి. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాలేదు. దీంతో సురేష్ శుక్రవారం ఉదయాన్నే పొలానికి వెళి పురుగుమందు తాగి ఇంటి వచ్చాడు. ఈ సంగతి తెలిసి భార్య లక్ష్మి పత్తికొండ వైద్యశాలకు తరలించేలోపే మృతి చెందాడు. తుగ్గలి ఎస్‌ఐ రమే్‌షబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.