ఆర్‌యూ పీజీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2020-10-01T08:40:43+05:30 IST

రాయలసీమ యూనివర్సిటీ పీజీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు(ఆర్‌యూ పీజీ 2020) నోటిఫికేషన్‌ను జారీ చేశారు.

ఆర్‌యూ పీజీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

కర్నూలు(అర్బన్‌), సెప్టెంబరు 30: రాయలసీమ యూనివర్సిటీ పీజీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు(ఆర్‌యూ పీజీ 2020) నోటిఫికేషన్‌ను జారీ చేశారు. బుధవారం ఉదయం రిజిస్ట్రార్‌ చాంబర్‌లో రెక్టార్‌ విశ్వనాథరెడ్డి, రిజిస్ట్రార్‌ వెంకట సుందరానంద పుచ్చా, పీజీ సెట్‌ కన్వీనర్‌, ప్రొఫెసర్‌ ఎంఈ రాణి పీజీ సెట్‌ విధివిధానాలు ప్రకటించారు. దరఖాస్తు రుసుం రూ.400 ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.300 చొప్పున నిర్ణయించారు. ఈనెల 10 నుంచి 26వ తేదీ వరకు ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, 28వ తేదీ వరకు  ఆలస్య రుసుము రూ.500, 29న రూ.1000 చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. 

Updated Date - 2020-10-01T08:40:43+05:30 IST