జీడీపీ నుంచి 2700 క్యూసెక్కులు విడుదల

ABN , First Publish Date - 2020-08-11T11:57:25+05:30 IST

గాజులదిన్నె ప్రాజెక్టుకు సోమవారం తెల్లవారుజామున మళ్లీ వరద మొదలైంది. దీంతో జీడీపీ అధికారులు

జీడీపీ నుంచి 2700 క్యూసెక్కులు విడుదల

గోనెగండ్ల, ఆగస్టు 10: గాజులదిన్నె ప్రాజెక్టుకు సోమవారం తెల్లవారుజామున మళ్లీ వరద మొదలైంది. దీంతో జీడీపీ అధికారులు ఉదయం 6 గంటలకు 4, 5 గేట్లు తెరిచి 2700 క్యూసెక్కులు హంద్రీ నదికి విడుదల చేశారు. ఇన్‌ఫ్లోను బట్టి  సాయంత్రం గేట్లను మూసివేస్తామని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఎగువన మద్దికెర, దేవనకొండ, పత్తికొండ, ఆస్పరి, తుగ్గలి ప్రాంతాలలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో నీరు జీడీపీలోకి చేరింది. ఉదయం ప్రాజెక్టుకు 5వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 

Updated Date - 2020-08-11T11:57:25+05:30 IST