నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు

ABN , First Publish Date - 2020-11-16T05:20:13+05:30 IST

మండలంలోని యాగంటి క్షేత్రంలో సోమవారం నుంచి కార్తీక మాస మహోత్సవాలు ప్రారంభమవుతున్నట్లు ఆలయ ఈవో డీఆర్‌కేవీ ప్రసాద్‌ ఆదివారం తెలిపారు.

నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు
శ్రీశైలంలో పుష్కరిణిని పరిశీలిస్తున్న ఈవో కేఎస్‌ రామరావు

బనగానపల్లె, నవంబరు 15: మండలంలోని యాగంటి క్షేత్రంలో సోమవారం నుంచి కార్తీక మాస మహోత్సవాలు ప్రారంభమవుతున్నట్లు ఆలయ ఈవో డీఆర్‌కేవీ ప్రసాద్‌ ఆదివారం తెలిపారు. డిసెంబరు 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, కుంకుమార్చన, సహస్ర నామావళి, పల్లకి సేవోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబరు 16న కార్తీక మాస మొదటి సోమవారం పురస్కరించుకొని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జయమ్మ దంపతులతో మహన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, కుంకుమార్చనలు, సహస్ర నామావళి, మహానివేదిత, ఉచిత ప్రసాద వితరణ సాయంత్రం ఉమామహేశ్వరస్వామివారి పల్లకి ఉత్సవాలు నిర్వహిచనున్నట్లు తెలిపారు. 23నన కార్తీక మాస రెండవ సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, మహా నివేదిత, ఉచిత ప్రసాద వితరణ, పల్లకి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29న న కార్తీక పౌర్ణమి వేడుకల సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఉమామహేశ్వరమ్మ దంపతుల ఆధ్వర్యంలో కుంకు మార్చన, ఇతర పూజా కార్యక్రమాలతో పాటు సాయంత్రం 6.30 గంటలకు కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందారెడ్డి, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి, ఆర్‌జేసీ ఎ.వెంకటేశ్‌, దేవదాయశాఖ కర్నూలు డిప్యూటీ కమిషనర్‌ సుబ్బారావు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈనెల 30న కార్తీక మాస మూడో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబరు 7వ తేదీన కార్తీక మాస నాలుగో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబరు 14వ తేదీ కార్తీక చివరి సోమవారం రోజు ప్రత్యేక పూజలతో ఆటు స్వామి వారి పల్లకి సేవోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 


‘గర్భాలయంలోకి ప్రవేశం లేదు’

కరోనా నేపథ్యంలో గర్భాలయంలోకి అనుమతి లేదని ఈవో డీఆర్‌కేవీ ప్రసాద్‌ తెలిపారు. గర్భాలయంలో అభిషేకాలు, అర్చనలు అర్చకులే భక్తుల గోత్రనామాలతో నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించనున్నట్లు తెలిపారు. 


బనగానపల్లె పట్టణంలోని కొండపేటలోని భవాని ఈశ్వరమార్కండేయ(నాలుగు స్తంభాల మండపం) ఆలయంలో సోమవారం నుంచి డిసెంబరు 14 వరకు కార్తీక మాస పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అఽధ్యక్షుడు కోటా చిన్న వెంకట సుబ్బరాయుడు, ఉపాధ్యక్షుడు కోటా శంకర్‌ ఆదివారం తెలిపారు. ప్రతి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

 

మహానంది: మహానంది శైవ క్షేత్రంలో సోమవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభమవుతున్నట్లు ఆలయ అధికారులు ఆదివారం తెలిపారు. ప్రత్యేక క్యూలైన్లతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈఏడాది 5 కార్తీక సోమవారాలు వచ్చాయని ఆయన తెలిపారు. కొవిడ్‌ కారణంగా మహానందిలో భక్తులకు గర్భాలయాల ప్రవేశం, కోనేర్లల్లో కార్తీక పుణ్యస్నానాలను రద్దు చేశామన్నారు. కార్తీక సోమవారాల్లో భక్తులకు సామూహిక రుద్రాభిషేకం, కేదారేశ్వర వ్రతం నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 29న కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఆలయంలో కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబరు 13, 14 తేదిల్లో కార్తీకమాస శివరాత్రి సందర్భంగా మహానందీశ్వరునికి లక్షబిల్వార్చన, కామేశ్వరీదేవికి లక్ష కుంకుమార్చన నిర్వహించడంతో మహానందిలో కార్తీక మాసోత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి ధ్వజ స్తంభానికి ఆకాశ ద్వీపాన్ని వెలిగించి ఈవో మల్లికార్జున ప్రసాద్‌, వేద పండితులు పూజలు చేశారు. భక్తులు కోవిద్‌ నిభందనలను పాటిస్తూ మహానందిలో పూజలు నిర్వహించాలని కోరారు.


చాగలమర్రి: మండలంలోని భీమలింగేశ్వర, రామలింగేశ్వర, బుగ్గమ ల్లేశ్వర, భైరవీశ్వర ఆలయాల్లో సోమవారం  కార్తీకమాస పూజలు నిర్వహి స్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్తీకపౌర్ణమి సందర్భంగా 29న రామలింగేశ్వర ఆలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, ఈవో రమణ తెలిపారు. డిసెంబరు 13న శివపార్వతుల కల్యాణం నిర్వహి స్తున్నామని తెలిపారు. ఆయా ఆలయాల్లో నెల రోజుల పాటు కార్తీక దీపోత్సవాలు, అభిషేకాలు జరుగుతాయని తెలిపారు.


 ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం

శ్రీశైలం, నవంబరు 15: శ్రీశైలం క్షేత్రంలో సోమవారం నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కారీకమాసం మెదటి సోమవారం సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం(రూ.150), అతిశీఘ్రదర్శనం (రూ.500) అందుబాటులోకి తెచ్చామన్నారు. భక్తులకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు అన్నప్రసాద వితరణ పొట్లాల రూపంలో చేయడానికి దేవస్థానం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. లడ్డూ ప్రసాదాలకు తొమ్మిది కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఉష్ణోగ్రతలను థర్మల్‌ గన్‌ ద్వారా పరిశీలించాలని భద్రతా అధికారులను ఆదేశిచారు. సెల్‌ ఫోన్‌న్లు, బ్యాగులను ఆలయంలోనికి అనుమతించవద్దని, ఆలయ నిబంధ నలను తెలియజేసి, వెలుపల భద్రపరుచుకోవాలసిందిగా సూచిం చాలని తెలిపారు. దేవాలయ సిబ్బంది కరోనా నిబంధనలు పాటిం చాలన్నారు.

Updated Date - 2020-11-16T05:20:13+05:30 IST