భారీగా కర్ణాటక మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-12-06T04:50:45+05:30 IST

కర్ణాటక నుంచి పెద్దకడు బూరు మండలం కంబళదిన్నె గ్రామానికి స్కార్పియోలో భారీగా మద్యాన్ని తరలిస్తుండగా పెద్దకడుబూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భారీగా కర్ణాటక మద్యం పట్టివేత

పెద్దకడుబూరు, డిసెంబరు 5: కర్ణాటక నుంచి పెద్దకడు బూరు మండలం కంబళదిన్నె గ్రామానికి స్కార్పియోలో భారీగా మద్యాన్ని తరలిస్తుండగా పెద్దకడుబూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీసు స్టేషన్‌లో ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక కొప్పల్‌ జిల్లా మైలాపురానికి చెందిన ఈడిగ శ్రీధర్‌, అదేజిల్లా ఉల్కిహాల్‌ గ్రామానికి చెందిన ఈడిగ బంగారప్ప, మంత్రాలయం మండలం చౌటిపల్లి గ్రామానికి చెందిన బోయ రాముడు కర్ణాటక రాష్ట్రం గంగావతి నుంచి ఓ వాహనంలో 38 బాక్సుల్లో 3,648 టెట్రా పాకెట్లను కంబళదిన్నె గ్రామ సమీపంలోని ఓ మఠం వద్దకు తరలిస్తున్నారు. సీఐ ఈశ్వరయ్య ఆదేశాల మేరకు ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, స్కార్పియోను సీజ్‌ చేశారు. వాహనం యజమానిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.      

Updated Date - 2020-12-06T04:50:45+05:30 IST