శ్రీగిరికి కాలినడకన కన్నడిగులు

ABN , First Publish Date - 2020-03-18T11:32:48+05:30 IST

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన కన్నడిగులు తరలివెళ్తున్నారు.

శ్రీగిరికి కాలినడకన  కన్నడిగులు

పాములపాడు, మార్చి 17: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన కన్నడిగులు తరలివెళ్తున్నారు. మూడు రోజులుగా కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారి గుండా  కర్నాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లా సోరుపూర్‌ తాలుకా కన్నెళ్లి, తెగ్గలి, దేవదుర్గ,  రాయచూర్‌, బాగల్‌కోట్‌, జమికండి, చిత్రదుర్గా, దావణగేరి, సింధనూరు తదితర ప్రాంతాల భక్తులు  శ్రీశైల క్షేత్రానికి కాలినడకన వెళ్తున్నారు. మండలంలోని జూటూరు నాగసాయి ఆశ్రమం వద్ద, పాములపాడు ఆరోగ్య ఉప కేంద్రం వద్ద ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. అక్కడక్కడ  తాగునీరు, భోజనం సదుపాయం కల్పించారు. 



Updated Date - 2020-03-18T11:32:48+05:30 IST