శ్రీశైలం అన్నదాన సత్రంలో ఘర్షణ.. ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-12-30T00:14:47+05:30 IST
శ్రీశైలంలోని కాకతీయ కమ్మసత్రంలో ఘర్షణ చోటుచేసుకుంది. భోజనశాలలో శ్రీను అనే వ్యక్తిపై నలుగురు దుండగులు దాడికి తెగబడ్డారు
కర్నూలు: శ్రీశైలంలోని కాకతీయ కమ్మసత్రంలో ఘర్షణ చోటుచేసుకుంది. భోజనశాలలో శ్రీను అనే వ్యక్తిపై నలుగురు దుండగులు దాడికి తెగబడ్డారు. దుండగుల దాడిలో బొడ్డు శ్రీను(55) అక్కడికక్కడే మృతిచెందాడు. మద్యం మత్తులో నలుగురు దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. సున్నిపెంట దగ్గర ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.