సేద్యం కలిసిరాక అప్పులపాలు కావడంతో.. బతుకు భారమై..

ABN , First Publish Date - 2020-09-20T17:28:07+05:30 IST

సొంత పొలానికి తోడు కౌలు పొలం లోనూ కష్టపడ్డాడు. సేద్యం కలిసిరాక..

సేద్యం కలిసిరాక అప్పులపాలు కావడంతో.. బతుకు భారమై..

బనగానపల్లె(కర్నూలు): సొంత పొలానికి తోడు కౌలు పొలంలోనూ కష్టపడ్డాడు. సేద్యం కలిసిరాక అప్పులపాలయ్యాడు. బతుకు భారమై పురుగుల మందు తాగాడు. నేలరాలు తున్న రైతుల జాబితాలో పుల్లయ్య కూడా చేరాడు. ఈ విషాద ఘటన బనగానపల్లె మండల పరిధిలోని కైప గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పెద్ద పుల్లయ్య (43)కు 2.5 ఎకరాల పొలం ఉంది. ఈ కాస్త పొలంలో సేద్యంతో జీవించడం కష్టమని భావించి గత ఏడాది 20 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. కంది, జొన్న, శనగ పంటలు సాగు చేశారు.


ఆశించినంత దిగుబడులు రాలేదు. పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోయాడు. పెట్టుబడులు ఎక్కువ కావడంతో ఊబిలో కూరుకు పోయాడు. గ్రామానికి చెందిన పలువురి వద్ద రూ.10 లక్షల వరకు అప్పు చేశారు. వారి నుంచి  ఒత్తిడి పెరిగింది. దిక్కుతోచని స్థితిలో ఇంటి వద్ద గడ్డి నివారణకు వాడే మందు తాగాడు. గమనించిన భార్య, బంధువులు,  బనగాన పల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అందిం చినా ఫలితం లేకపోయింది. రైతు భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని నంది వర్గం ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి తెలిపారు. పుల్లయ్యకు ఇద్ద రు కుమారులు ఉన్నారు. ఇంటి పెద్ద ఆత్మహత్యతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటోంది.



Updated Date - 2020-09-20T17:28:07+05:30 IST