57,500 ఎకరాల్లో వరి నష్టం

ABN , First Publish Date - 2020-12-13T05:55:19+05:30 IST

జిల్లాలో ఇటీవల కురిసిన తుఫాన్‌ వర్షాల ధాటికి 57,500 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఉమామహేశ్వరమ్మ తెలిపారు.

57,500 ఎకరాల్లో వరి నష్టం
చిన్నకంబలూరులో పంటను పరిశీలిస్తున్న జేడీఏ ఉమామహేశ్వరమ్మ

  1.  జేడీఏ ఉమామహేశ్వరమ్మ


రుద్రవరం, డిసెంబరు 12: జిల్లాలో ఇటీవల కురిసిన తుఫాన్‌ వర్షాల ధాటికి 57,500 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. మండలంలోని చిన్నకంబలూరు, పెద్దకంబలూరు, నరసాపురం గ్రామాల్లో శనివారం వరి పంటలను పరిశీలించారు. ఆ పంట పొలాలు ఈ-క్రాప్‌ చేయలేదని ఆమె దృష్టికి రైతులు తీసుకెళ్లారు. జేడీఏ స్పందించి ఈ-క్రాప్‌ చేయని వాటిని ఈ-క్రాప్‌ చేయిస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతుందని తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ సివిల్‌ సప్లయ్‌ అధికారులతో కూడా మాట్లాడారని తెలిపారు. ఈ- క్రాప్‌చేయని వరి పంట రైతులకు ఈ-క్రాప్‌ చేయించి నష్టపరిహారం అందేలా చూస్తామని, రైతులు అధైర్యపడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు వరప్రసాద్‌, సుధాకర్‌, ఏవో ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-13T05:55:19+05:30 IST