లౌ అవుట్ పనులను త్వరగా పూర్తి చేయాలి: జేసీ
ABN , First Publish Date - 2020-07-10T10:28:01+05:30 IST
జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే లౌ అవుట్ పనులను త్వరగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి ..

కర్నూలు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే లౌ అవుట్ పనులను త్వరగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ హాలులో జేసీ రవిపట్టన్‌శెట్టి, జేసీ-2 (అభివృద్ధి) రామసుందర్ రెడ్డి, జేసీ-3 (సంక్షేమం) సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డీఆర్వో పుల్లయ్య హౌస్ సైట్, రేషన్ కార్డులు, రైతుభరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, వైఎస్సార్ విలేజ్ క్లీనిక్స్, అంగన్‌వాడీ బిల్డింగ్ స్థలాల గుర్తింపు, గ్రౌండింగ్ వర్క్, ఉపాధి పనులు, జగనన్న పచ్చతోరణం, ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న నాడు-నేడు పనులు తదితర అంశాలపై ఆర్‌డీవోలు, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జేసీ రవిపట్టన్‌శెట్టి మాట్లాడుతూ ఇళ్ల స్థలాలకు సంబంధించిన లే అవుట్లు, లబ్ధిదారుల జాబితా, చాయాచిత్రాల అప్ లోడింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. జేసీ-2 రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. జేసీ-3 సయ్యద్ ఖాజా మొహిద్దీన్ మాట్లాడుతూ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి పనులు కల్పించాలన్నారు.