30న జాబ్‌మేళా

ABN , First Publish Date - 2020-12-28T05:22:28+05:30 IST

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ టీఎన్‌ విన్సెంట్‌ తెలిపారు.

30న జాబ్‌మేళా


కర్నూలు(అర్బన్‌), డిసెంబరు 27: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న జాబ్‌మేళాను నిర్వహిస్తున్నట్లు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌ టీఎన్‌ విన్సెంట్‌ తెలిపారు. జిల్లాలోని ఇంటర్మీడియట్‌, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు అని, వీరికి నెలకు రూ.11వేల వేతనంతో పాటు ట్రావెల్‌ అలవెన్సులు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. జాబ్‌మేళాకు బయోడేటాతో పాటు సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.


Updated Date - 2020-12-28T05:22:28+05:30 IST