కరోనా పరీక్షలను పెంచండి

ABN , First Publish Date - 2020-07-15T09:57:50+05:30 IST

కరోనా వైర్‌సను నియంత్రించేందుకు పరీక్షలను పెంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చీఫ్‌ సెక్రటరీ సూచించారు.

కరోనా పరీక్షలను  పెంచండి

 వైద్య ఆరోగ్య శాఖ చీఫ్‌ సెక్రటరీ డా. జవహర్‌రెడ్డి


కర్నూలు, జూలై 14(ఆంధ్రజ్యోతి): కరోనా వైర్‌సను నియంత్రించేందుకు పరీక్షలను పెంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చీఫ్‌ సెక్రటరీ సూచించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో కరోనా వ్యాప్తి, నియత్రణ, కరోనా మరణాలు, కమ్యూనిటీ సర్వెలెన్స్‌, మొబైల్‌ టెస్టింగ్‌ సెంటర్‌ తదితర అంశాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ వీరపాండియన్‌ పాల్గొన్నారు. జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసున్నామని, కంటైన్మెంట్‌ జోన్లలో ప్రతి ఇంటికి వెళ్లి కరోనా పరీక్షలు చేస్తున్నట్లు కలెక్టర్‌ వివరించారు. జిల్లాకు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్స్‌ అందజేయాలని కలెక్టర్‌ కోరారు. కార్యక్రమంలో జేసీ రామసుందర్‌రెడ్డి, కర్నూలు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. చం ద్రశేఖర్‌, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ నంరేంద్రనాథ్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డా.రామగిడ్డయ్య, అడిషనల్‌ డీఎంహెచ్‌వో డా.వెంకటరమణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-15T09:57:50+05:30 IST