హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-25T06:03:50+05:30 IST

వినియోగదారుల హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి అన్నారు.

హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలి
వినియోగదారుల చట్టం పుస్తకాన్ని అవిష్కరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌

  1.  వినియోగదారుల చట్టం పుస్తకాన్ని అవిష్కరించిన జేసీ


కర్నూలు(అర్బన్‌), డిసెంబరు 24: వినియోగదారుల హక్కులు,  బాధ్యతలు తెలుసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి అన్నారు. గురువారం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌ అగ్రికల్చర్‌ సెమినార్‌ హాల్‌లో జిల్లా వినియోగదారుల సంచారం కేంద్ర అధ్యక్షుడు ఎం. నదిమ్‌ హుసేన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వినియోగదారుల చట్టం-2019 నూతన నిబంధనల పుస్తకాన్ని జేసీ, డీఆర్‌వో పుల్లయ్య ఆవిష్కరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ సమాజంలో అందరూ బాధ్యతగా వ్యవహరిస్తే నష్టపోకుండా ఉంటారని అన్నారు. కార్యక్రమంలో డీఎ్‌సవో సయ్యద్‌ యాసీన్‌, శివమోహన్‌రెడ్డి, అబ్దుల్లా, అనిల్‌, ఫారుక్‌ పాల్గొన్నారు. 


ఎమ్మిగనూరు టౌన్‌: పట్టణంలోని ఎస్‌ఎంఎల్‌ కళాశాలలో గురు వారం జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్‌ మహబూబ్‌బాషా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వినియోగదారుల చట్టాని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  


డోన్‌(రూరల్‌): వస్తువులు కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సమగ్ర వినియోగదారుల సంక్షేమ సంస్థ అధ్యక్షుడు  సాదనగిరి రామక్రిష్ణారెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని జ్యోతిమిత్ర మండలి కార్యాలయంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామక్రిష్ణారెడ్డి మాట్లాడుతూ వినియోగదారులు వస్తువుల కొనుగోళ్లలో నష్టం జరిగితే వినియోగదారుల చట్టాల ద్వారా న్యాయం పొందవచ్చన్నారు.  వినియోగదారుల రక్షణ సంఘం అధ్యక్షుడు ఏఈ నాగరాజు, సభ్యులు పురుషోత్తం, శ్రీను పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-25T06:03:50+05:30 IST