-
-
Home » Andhra Pradesh » Kurnool » Janata Curfew
-
జనతా కర్ఫ్యూ సక్సెస్
ABN , First Publish Date - 2020-03-23T10:42:24+05:30 IST
కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు చేపట్టిన జనతా కర్ఫ్యూ మండలంలో సక్సెస్ అయింది.

స్వీయ నిర్బంధంలో ప్రజలు
రోడ్లన్నీ నిర్మానుష్యం
కోడుమూరు, మార్చి 22: కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు చేపట్టిన జనతా కర్ఫ్యూ మండలంలో సక్సెస్ అయింది. ఆదివారం ఉదయం 7 నుంచి ప్రజలు రోడ్ల మీదకు రాకుండా స్వీయ నిర్బంధంలో ఉండి పోయారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారా యి. హోటళ్లు, సినిమా, పెట్రోల్ బంక్‌లు, కిరాణ, వస్త్ర దుకాణాలు మూతపడ్డాయి. బస్సు సర్వీసులు రద్దు చేయడంతో కొత్త, పాత బస్టాండ్లు బోసి పోయాయి.
కోడుమూరు (రూరల్)..
కరోనా వ్యాప్తిని అరికట్టుటలో భాగంగా ఆదివారం చేపట్టిన జనతా కర్ఫ్యూ విజయవంతం అయ్యింది. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
గూడూరు...
మండలంలో ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలందరూ ఇంట్లోనే ఉండి బయటకు రాకుండా జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటించారు. దీంతో జనసంచారం లేక రోడ్లన్నీ వెలవెలబోయాయి.
సి.బెళగల్..
కరోనా ప్రభావంతో మండల ప్రజలు ఆదివారం ఉదయం నుంచి ఇంట్లోనే ఉండిపోయారు. ప్రజలు రోడ్లమీదకు రాకుం డా రెవెన్యూ అధికారులు గ్రామాలలో దండోరా వేయించారు.
ఆత్మకూరు..
కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో భాగంగా ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు ఆత్మకూరులో ప్రజ లు సంపూర్ణంగా సహకరించారు. వ్యాపారులు స్వచ్ఛం దంగా దుకాణాలు మూసేశారు. ఆత్మ కూరు సీఐ కళా వెంకటరమణ, ఎస్సై నాగేంద్రప్రసాద్ కర్ఫ్యూ పరిస్థితిని పరిశీ లించారు.
చాగలమర్రి..
కరోనా మహమ్మారి కట్టడికి ప్రధాని నరేంద్రమోదీ తలపెట్టిన జనతా కర్ఫ్యూ పిలుపుకు ఆదివారం చాగలమర్రిలో ప్రశాంతంగా సాగింది. చాగలమర్రి గ్రామంలో సాయంత్రం 5 గంటలకు గాంధీ విగ్రహం వద్ద పోలీసులు, ప్రజలు చప్పట్లతో సంఘీభావం తెలిపారు.
రుద్రవరం..
మండలంలో జనతా కర్ఫ్యూ సందర్భంగా యువకులు ఇళ్లలోనే క్యారమ్ బోర్డులు ఆడారు. వృద్ధులు మండపాల్లో పులి మేకల క్రీడ ఆడుతూ గడిపారు. సాయంత్రం 5 గంటల తరువాత రోడ్ల మీదకు వచ్చి ప్రజలు చప్పట్లు కొట్టారు.
ఆళ్లగడ్డ..
ఆళ్లగడ్డలో కరోనా వ్యాధి నివారణకు జనతా కర్ఫ్యూకు సహకరించాలని కోరటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటిలో కుటుంబ సభ్యులతో క్యారమ్స్ ఆడుతూ గడిపారు. పట్టణ సీఐ ఎన్వీ రమణ శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిల లక్ష్మీనరసింహస్వామి దేవాయలం భక్తులు లేక వెలవెల బోయింది. కరోనా వ్యాధి ప్రభావంతో గుడికి ఈనెల 31వ తేదీ వరకు భక్తులకు దర్శనం నిలిపి వేయడంతో రావద్దని ఆలయ అధికారులు తెలిపారు. కర్ఫ్యూ మూలంగా భక్తులు లేక వెలవెలబోయింది.
దొర్నిపాడు...
కరోనా వ్యాధి నివారణకు జనతా కర్ఫ్యూను ఉదయం 7 నుంచి ప్రజలు స్వచ్ఛందంగా పాటించారు. దుకాణాలు మూసివేయడంతో పాటు ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంటికే పరిమితమయ్యారు.
శిరివెళ్ల..
కరోనా వైరస్ నివారణలో భాగం గా ఆదివారం మండలంలో దుకాణాలను మూసి వేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో భాగస్వాములయ్యారు.
ఉయ్యాలవాడ...
మండలంలో ఆదివారం జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రజలు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లకే పరిమితం అయ్యారు. సాయంత్రం 5 గంటలకు ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చి డాక్టర్లకు, సేవలు అందిస్తున్న పోలీసులకు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు.
శ్రీశైలం..
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జనతా కర్ఫ్యూ శ్రీశైలంలో సంపూ ర్ణంగా ప్రజలు పాటించారు. క్షేత్రంలో పూర్తి గా భక్తుల సంచారం నిలిచిపోయింది. శ్రీశైల దేవస్థాన అధికారులు ఉభయ దేవాలయాలు, అన్ని ఉపాలయాలను మూసివేశారు. కాలినడ కన వచ్చిన భక్తులు గంగాధర మండపం నుంచి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేఎస్‌ఆర్టీసీ బస్సుల్లో వెళ్లిపో యారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం నిర్మా నుష్యంగా మారింది.