5.63 లక్షల ఎకరాలకు సాగునీరు

ABN , First Publish Date - 2020-08-20T11:14:02+05:30 IST

జిల్లాలో ప్రధాన జలాశయాలు, కాల్వల ద్వారా ఖరీఫ్‌లో 5,63,186 ఎకరాలకు నీరందిస్తామని మైనర్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి తెలి

5.63 లక్షల ఎకరాలకు సాగునీరు

 నీటి పారుదల శాఖ కార్యాచరణ 


కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 19: జిల్లాలో ప్రధాన జలాశయాలు, కాల్వల ద్వారా ఖరీఫ్‌లో 5,63,186 ఎకరాలకు నీరందిస్తామని మైనర్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలన్నారు. కేసీ కెనాల్‌ కింద కర్నూలు జిల్లాలో 1,03,476 ఎకరాలు, కడపలో 74,912 ఎకరాలు మొత్తం 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.


ఎల్లెల్సీ కింద 35 వేల ఎకరాలు, తెలుగుగంగ ప్రాజెక్టు కింద 1,23,700 ఎకరాలు, హంద్రీనీవా కాలువ ద్వారా 31,000 ఎకరాలు, శ్రీశైలం కుడిగట్టు కాలువ ద్వారా 1,28,000 ఎకరాలు, సిద్దాపురం లిఫ్టు స్కీం ద్వారా 10 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ఎస్‌ఈ తెలిపారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు ఈసారి పూర్తి స్థాయిలో నీరు చేరిందని, సాగుకు అవసరమైన నీటి విడుదలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.


వరదరాజస్వామి ప్రాజెక్టు కింద 5.600 ఎకరాల ఆయకట్టు ఉందని, రైతులు కోరితే నీరు విడుదల చేస్తామని చెప్పారు. వర్షాలకు చెరువులకు నీరు చేరిందని, వీటి కింద 81వేల ఎకరాలకు నీరందిస్తామని అన్నారు. 

Read more