-
-
Home » Andhra Pradesh » Kurnool » inti patalu kosam adolana
-
‘25న ఇంటి స్థలం పట్టాలు ఇవ్వాలి’
ABN , First Publish Date - 2020-12-11T05:29:55+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ ఈ నెల 25న ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ చేతివృత్తిదారుల సమైఖ్య రాష్ట్ర కన్వీనర్ కె.రామాంజినేయులు అన్నారు.

కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 10: రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ ఈ నెల 25న ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ చేతివృత్తిదారుల సమైఖ్య రాష్ట్ర కన్వీనర్ కె.రామాంజినేయులు అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి, వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సమాఖ్య, చేతివృత్తుల సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు నుంచి మూడున్నర సెంట్లకు పెంచాలని, పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు నుంచి రెండు సెంట్లకు పెంచి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. ఇంటి స్థలాల పంపిణీపై కోర్టును ఆశ్రయించిన వారు పిటిషన్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన సమాఖ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి గరికెపాటి రవి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, రంగన్న తదితరులు పాల్గొన్నారు.
దేవనకొండ: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న పంపిణీ చేసే ఇంటి స్థలాల్లో డబల్ బెడ్‌రూంలను నిర్మించి ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవులశేఖర్, జిల్లా అద్యక్ష, ఉపాధ్య క్షుడు నబిరసూల్, మద్దిలేటిశెట్టి డిమాండ్‌చేశారు. గురువారం దేవన కొండలో ధర్నా చేశారు. సీపీఐ మండల కార్యదర్శి నర్సారావు, పట్టణ సహాయ కార్యదర్శులు రాజశేఖర్, నెట్టెకల్లు, ప్రసాద్, రాజన్న, వెంక టేశ్వర్లు, మనోజ్, భాస్కర్, శ్రీనివాసులు, కోదండ పాల్గొన్నారు.
మద్దికెర: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేయకుండా పంపిణీ చేయాలని మండల సీపీఐ సహాయ కార్య దర్శి నెట్టికంటయ్య, శాఖ కార్యదర్శి సుధాకర్ అన్నారు. గురువారం మండలంలోని పెరవలి గ్రామంలో గ్రామ సచివాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాం తాల్లో 1.50 సెంటు కాకుండా 3సెంట్లు ఇవ్వాలని, పట్టణ ప్రాంతాల్లో 2సెంట్లు ఇవ్వాలన్నారు. అనంతరం గ్రామ కార్యదర్శి ఉమాబాయికి వినతిపత్రాన్ని అందజేశారు.
డోన్(రూరల్): గ్రామీణ పేదలకు రాష్ట్ర ప్రభుత్వం 3 సెంట్ల స్థలాన్ని పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని ఉడుములపాడు, దొరపల్లె గ్రామాల్లోని సచివాలయాల వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు వరదరాజు, నక్కి శ్రీకాంత్, పులిశేఖర్, ప్రభాకర్ పాల్గొన్నారు.