ఇంటర్‌ పరీక్షలకు 879 మంది గైర్హాజర్‌

ABN , First Publish Date - 2020-03-12T11:14:51+05:30 IST

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు బుధవారం గణితం, బాటనీ, ఫిజిక్స్‌ సబ్జెక్ట్స్‌ పరీక్షలు రాశారు.

ఇంటర్‌ పరీక్షలకు 879 మంది   గైర్హాజర్‌

రెండు మాల్‌ ప్రాక్టిస్‌ కేసులు  



 కర్నూలు(ఎడ్యుకేషన్‌) మార్చి 11: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు బుధవారం గణితం, బాటనీ, ఫిజిక్స్‌ సబ్జెక్ట్స్‌ పరీక్షలు రాశారు. ఇందులో 879 మంది విద్యార్థులు గైర్హాజర్‌ అయినట్లు ఆర్‌ఐఓ సాలాబాయి తెలిపారు. అలాగే రెండు మాల్‌ ప్రాక్టిస్‌ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.   ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో  జిల్లాలో  35,871 మంది విద్యార్థులు ఉన్నారు.


ఇందులో జనరల్‌ కోర్సు విద్యార్థులు 33,701 మందికాగా, ఒకేషన్‌ల్‌ కోర్సులో  2170 మంది విద్యార్థులు ఉన్నారు. జనరల్‌ కోర్సులో 33,701 మందికిగాను, 32,907 మంది పరీక్షలకు హాజరుకాగా, ఇందులో 794 మంది గైర్హాజర్‌ అయ్యారు. అలాగే, ఒకేషనల్‌ విద్యార్థులు 2170 మందికిగాను, 2085 మంది హాజరుకాగా, 85 మంది విద్యార్థులు గైర్హాజర్‌ అయ్యారు. కర్నూలు ఉస్మానియా కళాశాల, ఆవుకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రాల్లో ఒక్కో  విద్యార్థి   మాల్‌ ప్రాక్టిస్‌కు పాల్పడటంతో కేసులు నమోదయ్యాయి.  జిల్లా వ్యాప్తంగా 43 పరీక్ష కేంద్రాలను తనీఖీ బృందాలు పర్యవేక్షించాయి. 

Updated Date - 2020-03-12T11:14:51+05:30 IST