రేపటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

ABN , First Publish Date - 2020-03-18T11:28:46+05:30 IST

స్థానిక ప్రభుత్వ (టౌన్‌) జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంప్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతున్నట్లు ఆర్‌ఐవో సాలాబాయి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేపటి నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

కర్నూలు(ఎడ్యుకేషన్‌), మార్చి 17: స్థానిక ప్రభుత్వ (టౌన్‌) జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ క్యాంప్‌లో ఈ నెల 19వ తేదీ నుంచి ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతున్నట్లు ఆర్‌ఐవో సాలాబాయి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్‌ వాల్యుయేషన్‌ ఆర్డర్స్‌ వచ్చిన అధ్యాపకులందరినీ రిలీవ్‌ చేయాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.  రిలీవ్‌ అయిన అధ్యాపకులందరూ తమకు కేటాయించిన విధుల్లో  చేరాలన్నారు. విధులకు హాజరు కాని పక్షంలో బోర్డు సెక్రటరీ ఆదేశాల మేరకు చర్యలు తప్పవని అన్నారు. మొదటి స్పెల్‌లో తెలుగు, ఆంగ్లం, సివిక్స్‌, హిందీ, గణితం సబ్జెక్టుల జవాబుపత్రాల మూల్యాంకనం జరుగుతుందని అన్నారు. 20 నుంచి మైనర్‌ మీడియా సబ్జెక్ట్స్‌ ఉర్దూ, ఫర్షియన్‌, తమిళం, అరబిక్‌, కన్నడ మూల్యాంకనం జరుగుతుందని అన్నారు. 

Updated Date - 2020-03-18T11:28:46+05:30 IST