ఎరువుల దుకాణాల తనిఖీ

ABN , First Publish Date - 2020-09-05T09:43:06+05:30 IST

బనగానపల్లె నందవరంలోని ఎరువుల దుకాణా లను జిల్లా వ్యవసాయశాఖ జేడీ ఉమామ హేశ్వర మ్మ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. దుకాణాల్లోని ఎరువుల స్టాక్‌ను, రికార్డులను ఆమె పరిశీలించారు. స్టా

ఎరువుల దుకాణాల తనిఖీ

బనగానపల్ల్లె, సెప్టెంబరు 4: బనగానపల్లె నందవరంలోని ఎరువుల దుకాణా లను జిల్లా వ్యవసాయశాఖ జేడీ ఉమామ హేశ్వర మ్మ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. దుకాణాల్లోని ఎరువుల స్టాక్‌ను, రికార్డులను ఆమె పరిశీలించారు. స్టాక్‌ బోర్డులను పరిశీలిం చారు. పట్టణంలోని భానుముక్కల సొసైటీని ఆమె ప్రత్యేకంగా తనిఖీ చేశారు. యూరియాకు సంబంధించి పంపిణీలో రైతుల పట్ల వివక్ష చూపుతు న్నట్లు ఫిర్యాదు రావడంతో సొసైటీలోని రికార్డులను, స్టాక్‌ను తనిఖీ చేశారు. జేడీఏ మాట్లాడుతూ అధిక ధరకు ఎరువుల విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ఎరువుల కొరత రాకుండా చూస్తామన్నారు. ఆమె వెంట బనగానపల్లె వ్యవసాయాధికారి విజయ్‌ కుమార్‌, అవుకు వ్యవసాయాధికారి కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. 


అవుకు: అవుకు పట్టణంలోని మనగ్రోమోర్‌ కేంద్రాన్ని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రాధమిక వ్యవ సాయ సహకార సంఘం వద్దకు చేరుకొని అక్కడికి వచ్చిన 20 టన్నుల కోరమాండల్‌ యూరియాను పరిశీలించారు. 


Updated Date - 2020-09-05T09:43:06+05:30 IST