అయ్యో.. పాపం..!

ABN , First Publish Date - 2020-03-27T10:20:46+05:30 IST

చదువు కోసం బిడ్డలను హాస్టళ్లలో వదిలారు. ఉపాధి కోసం గుంటూరు ప్రాంతా నికి వలస వెళ్లారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా హాస్టల్‌లో ఉన్న పిల్లలు ఇంటికి వచ్చారు.

అయ్యో.. పాపం..!

వలస వెళ్లి ఇరుక్కుపోయిన తల్లిదండ్రులు

హాస్టల్‌ నుంచి ఇంటికొచ్చిన చిన్నారులు

అన్నంపెట్టే దిక్కులేక ఆకలి బాధలు


డోన్‌, మార్చి 26: చదువు కోసం బిడ్డలను హాస్టళ్లలో వదిలారు. ఉపాధి కోసం గుంటూరు ప్రాంతా నికి వలస వెళ్లారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా హాస్టల్‌లో ఉన్న పిల్లలు ఇంటికి వచ్చారు. వలస వెళ్లిన తల్లిదండ్రులు తిరిగివచ్చే మార్గంలేక అక్కడే ఇరుక్కుపో యారు. దీంతో అన్నం పెట్టేదిక్కులేక చిన్నారులు ఆకలితో అలమటిస్తు న్నారు. డోన్‌ మండలం ఆవులదొడ్డికి చెందిన వలస కూలీల దీనగాథ ఇది. ఆవులదొడ్డి నుంచి 50 కుటుంబాలు వలస వెళ్లాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గండలూరులో మిర్చి కోత పనులు చేసుకునేవారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అక్కడ ఇరుక్కుపోయారు. గుడారాల్లో కాలం గడుపుతున్నారు. డోన్‌ హాస్టళ్ల నుంచి ఇంటికి వచ్చిన వారి పిల్లలు దిక్కులేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చొరవ చూపి వలస కూలీలను స్వస్థలాలకు రప్పించాల్సిన అవసరం ఉంది. అప్పటిదాకా భోజనం పెట్టాలని చిన్నారులు అధికారులను కోరుతున్నారు. 

Updated Date - 2020-03-27T10:20:46+05:30 IST