‘144 సెక్షన్‌ అమలు’

ABN , First Publish Date - 2020-03-24T11:15:39+05:30 IST

బనగానపల్లెలో 144 సెక్షన్‌ అమలు చేసినట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి సోమవారం తెలిపారు.

‘144 సెక్షన్‌ అమలు’

బన గానపల్లె, మార్చి 23: బనగానపల్లెలో 144 సెక్షన్‌ అమలు చేసినట్లు ఎస్‌ఐ కృష్ణమూర్తి సోమవారం తెలిపారు. పట్టణంలోని పెట్రోల్‌బంక్‌, ఆస్థానంరోడ్డు, జీఎం టాకీసు, పాతబస్టాండు, పొట్టిశ్రీరాముల కూడలితో పాటు పట్టణంలో పలుచోట్ల 144 సెక్షన్‌ అమలులో ఉందని తెలిపారు. 


కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ పంచాయతీ ఈవో సతీ్‌షకుమార్‌రెడ్డి హెచ్చరించారు. సంతమార్కెట్‌ను పరిశీలించారు.


 బనగానపల్లె పట్టణంలో అత్యవసర సర్వీసులు తప్ప మిగతా అన్ని దుకాణాలను సీఐ సురే్‌షకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మూసి వేయించారు. పట్టణంలో బనగానపల్లె డిపో నుంచి ఒక్క బస్సు కూడా కదలలేదు. డిపోలకే పరిమితమయ్యాయి. 

Read more