కూల్చివేస్తే ఉరే గతి

ABN , First Publish Date - 2020-12-27T06:28:32+05:30 IST

నగరంలోని వెంకటాచలపతి కాంప్లెక్స్‌లో శనివారం 12 దుకాణాల కూల్చివేత ఉద్రికత్తకు దారి తీసింది. నగర పాలక సిబ్బంది ఎక్స్‌కవేటర్లతో అక్కడికి చేరుకోగానే దుకాణదారులు కుటుంబీకులతో కలిసి ఉరితాళ్లతో నిరసనకు దిగారు.

కూల్చివేస్తే ఉరే గతి
ఉరి తాళ్లతో నిరసన తెలుపుతున్న బాధితులు

  1. దుకాణాలను తొలగించిన కార్పొరేషన్‌ అధికారులు
  2. అడ్డుకున్న యజమానులు


కర్నూలు(అర్బన్‌), డిసెంబరు 26: నగరంలోని వెంకటాచలపతి కాంప్లెక్స్‌లో శనివారం 12 దుకాణాల కూల్చివేత ఉద్రికత్తకు దారి తీసింది. నగర పాలక సిబ్బంది ఎక్స్‌కవేటర్లతో అక్కడికి చేరుకోగానే దుకాణదారులు కుటుంబీకులతో కలిసి ఉరితాళ్లతో నిరసనకు దిగారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు సర్దిచెప్పారు. ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ అక్కడికి వచ్చి ఆరా తీశారు. ఆలోపే ఓ మంత్రి నుంచి వచ్చిన ఆదేశాలతో ఎమ్మెల్యే అక్కడి నుంచి నిష్కమించారు. మున్సిపల్‌ కాంప్లెక్స్‌లే పార్కింగ్‌ స్థలాల్లో నిర్మించినా పట్టించుకోవడం లేదని, 1952లో అన్ని అనుమతులతో దుకాణాలను నిర్మించుకుంటే రాజకీయ కుట్రతో కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపించారు. 


1952లోనే అనుమతులు తీసుకున్నాం

1952లోనే అన్ని అనుమతులు తీసుకుని కాంప్లెక్స్‌ నిర్మించాం. ఇప్పుడు అక్రమ నిర్మాణాలు అంటున్నారు. పత్రాలు సమర్పించేందుకు సమయం ఇవ్వడం లేదు. ఏకపక్షంగా కూల్చివేస్తున్నారు. ఎంతోమంది ఉపాధి కోల్పోతున్నాం. - చెరుకూరి మనోహర్‌, దుకాణదారు


గడువు ఇచ్చాం..

దుకాణదారులకు యూసీ నెంబర్‌ 5, 6, 7 నోటీసులు ఇచ్చాము. 6 నెంబర్‌పైన కోర్టుకు వెళ్లారు. సదరు పత్రాలు, ప్లాన్‌ పరిశీలించాలని కోర్టు సూచించింది. పత్రాలు ఇవ్వా లని దుకాణదారులను కోరాము. నాలుగు వారాల సమయం ఇచ్చినా స్పందన లేదు. 6వ నోటీసు కోర్టు పరిఽధిలో ఉండటంతో దాన్ని వదిలేసి 5, 7 నోటీసుల పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నాం. - కోటయ్య, డీసీపీ, నగర పాలక సంస్థ

Updated Date - 2020-12-27T06:28:32+05:30 IST