మరణంలోనూ వీడని బంధం.. భార్య మృతిని తట్టుకోలేక..

ABN , First Publish Date - 2020-12-10T05:45:22+05:30 IST

కర్నూలు జిల్లా బండిఆత్మకూరు వీవర్స్‌ కాలనీలో భార్య, భర్త కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందారు.

మరణంలోనూ వీడని బంధం.. భార్య మృతిని తట్టుకోలేక..
కమరుద్దీన్‌, కరీమున్నీసా దంపతులు (ఫైల్‌)

గంటల వ్యవధిలో దంపతుల మృతి


బండి ఆత్మకూరు, డిసెంబరు 9: కర్నూలు జిల్లా బండిఆత్మకూరు వీవర్స్‌ కాలనీలో భార్య, భర్త కొన్ని గంటల వ్యవధిలోనే మృతి చెందారు. కాలనీకి చెందిన కరీమున్నీసా(59), కమరుద్దీన్‌(65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కమరుద్దీన్‌ ఆయాసంతో బాధపడుతూ సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో మృతి చెందారు. ఆమె భర్త కమరుద్దీన్‌కు షుగర్‌, బీపీ, పక్షవాతం ఉన్నాయి. భార్య మృతిని తట్టుకోలేక కమరుద్దీన్‌ కూడా మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ప్రాణాలు వదిలారు. దీంతో ఆ కాలనీలో విషాదం అలుముకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరికీ వివాహాలు అయ్యాయి. దంపతులిద్దరికీ బంధువులు బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2020-12-10T05:45:22+05:30 IST