ఇళ్ల పట్టాల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-26T05:27:19+05:30 IST

పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి తెలిపారు.

ఇళ్ల పట్టాల పంపిణీ
పెద్దకొట్టాల గ్రామంలో ఇంటి పట్టాను అందజేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే

  1. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు


నంద్యాల, డిసెంబరు 25: పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి తెలిపారు. అన్నారు. పంపిణీ కార్యక్రమాన్ని మండలంలోని పెద్దకొట్టాల గ్రామంలో నిర్వహించారు. గ్రామానికి చెందిన 153 మంది అర్హులైన పేదలకు ఇళ్ళ పట్టాలను ఎంపీ, ఎమ్మెల్యే అందజేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.


నందికొట్కూరు: పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై పంపిణీ చేశారు. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 92 లేఅవుట్లలో 12,374 ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారి వేణుగోపాల్‌, ఇళ్ల స్థలాల ప్రత్యేకాధికారి రాఘవేంద్ర, మున్సిపల్‌ ప్రత్యేకాధికారి నాగరాజునాయుడు, కమిషనర్‌ అంకిరెడ్డి, తహసీల్దార్‌ రూపలత, నాయకులు ధర్మారెడ్డి, విక్టర్‌, భరత్‌కుమార్‌రెడ్డి, చెరకుచెర్ల రఘురామయ్య పాల్గొన్నారు. 


కోవెలకుంట్ల: అర్హులందరికీ ఇంటి పట్టాలు ఇచ్చి సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వడమే సీఎం జగన్‌ లక్ష్యమని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. పట్టణంలోని కృష్ణతేజ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాజరై లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవెలకుంట్లలో 944 మందికి ఇంటి పట్టాలు మంజూరయ్యాయని తెలిపారు. మార్కెట్‌యార్డు చైర్మన్‌ బీవీ నాగార్జునరెడ్డి, కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ రామిరెడ్డి, లాయర్‌ మధుసూదన్‌రెడ్డి, తహసీల్దారు పుష్పకుమారి, హౌసింగ్‌ డీఈ కృష్ణారెడ్డి, నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్‌ రమణయ్య, కోవెలకుంట్ల ప్రత్యేకాధికారి కొండారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

ఆళ్లగడ్డ: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి అన్నారు. పట్టణ శివార్లలో నిర్మించిన టిడ్కో గృహాలకు సంబంధించిన పట్టాలను అందించారు. మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి ఉమామహేశ్వరమ్మ, కమిషనర్‌ రమేష్‌బాబు, వైసీపీ నాయకులు ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి, చాగలమర్రి షేక్‌ బాబులాల్‌, రాంపుల్లారెడ్డి పాల్గొన్నారు.


ఆత్మకూరు: అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేసేందుకు కృషి చేస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. చక్రం హోటల్‌ వెనుక భాగంలోని ప్రభుత్వ ఇంటి స్థలాలను అర్హులైన వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో 3860 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి, మత్య్సశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీహరి, తహసీల్దార్‌ ప్రకాష్‌బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటదాసు, వైసీపీ నాయకులు పువ్వాడి భాస్కర్‌, అంజాద్‌అలీ, విజయ్‌చౌదరి, బాలన్న, ఎంఏ రషీద్‌, మోమిన్‌ మునీర్‌బాషా, శివపురం నూర్‌మహ్మద్‌, సయ్యద్‌మీర్‌, సుల్తాన్‌బాషా తదితరులు ఉన్నారు. 


ఓర్వకల్లు: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నన్నూరు గ్రామంలో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పక్కా గృహాల నిర్మాణాలకు భూమి పూజ చేశారు.  మాజీ సర్పంచ్‌ చెన్నారెడ్డి, సీఈవో వెంకటసుబ్బయ్య, తహసీల్దార్‌ శివరాముడు, డీఎస్పీ మహేష్‌, సీఐ శ్రీనాథ్‌ రెడ్డి, ఎంపీడీవో శివనాగప్రసాద్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ నారాయణమ్మ, వైసీపీ నాయకులు గోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-26T05:27:19+05:30 IST