ఇళ్ల పట్టాల పంపిణీ చారిత్రాత్మకం

ABN , First Publish Date - 2020-12-28T05:20:34+05:30 IST

రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చారిత్రాత్మకమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజారెడ్డి అన్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీ చారిత్రాత్మకం
ఇంటి పట్టా అందజేస్తున్న మంత్రి బుగ్గన

  ఆర్థిక మంత్రి బుగ్గన


ప్యాపిలి, డిసెంబరు 27: రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చారిత్రాత్మకమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజారెడ్డి అన్నారు. ఆదివారం ప్యాపిలిలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు సభ్యుడు  పోచా బ్రహ్మానందరెడ్డి కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గత 75 ఏళ్ల పాలనలో అప్పటి ప్రభుత్వాలు కేవలం 10 లక్షల పట్టాలు మాత్రమే పంపిణీ చేశారన్నారు. అయితే అధికారంలోనికి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే 30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. ఇంటి స్థలాలు పంపిణీ చేయడమే కాకుండా ఇళ్లను కూడ ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రైతు, మహిళా పక్షపాతన్నారు. అందుచేతనే వారి పేరిట అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి తెలిపారు.  అంతకు ముందు మండలంలోని పోతుదొడ్గి గ్రామంలో శుద్ధజలం ప్లాంటును ప్రారంభించారు. రూ.16 కోట్లతో ప్యాపిలి నుంచి శభా్‌షపురం వరకు నూతనంగా నిర్మించనున్న డబుల్‌ రోడ్డు నిర్మాణానికి, ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలకు మంత్రి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ వీరపాండియన్‌, ఆర్డీవో వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామిరెడ్డి, వైసీపీ నాయకులు మెట్టు వెంకటేశ్వరరెడ్డి, శ్రీరాములు, దిలీప్‌ చక్రవర్తి పాల్గొన్నారు.  

 

Updated Date - 2020-12-28T05:20:34+05:30 IST