ఆఖరి చూపు, అంత్యక్రియలకూ బంధువులు ముందుకు రాకపోవడంతో..

ABN , First Publish Date - 2020-07-20T18:13:44+05:30 IST

హొళగుంద ముదేగౌడ మఠం సమీపంలోని..

ఆఖరి చూపు, అంత్యక్రియలకూ బంధువులు ముందుకు రాకపోవడంతో..

అంతిమ విషాదం


హొళగుంద(కర్నూలు): హొళగుంద ముదేగౌడ మఠం సమీపంలోని శివాలయం వద్ద ఆదివారం ఓ వృద్ధుడు మృతి చెందాడు. అనాథగా భావించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విచారించిన పోలీసులు, ఆ వృద్ధుడిని బీసీ కాలనీకి చెందిన జట్కా వెంకోబ (60)గా గుర్తించారు. ఆయనకు వివాహం కాలేదని, కొన్ని రోజుల క్రితం వరకూ బంధువుల వద్ద ఉండేవాడని తెలుసుకున్నారు. ఆయన మృతి చెందిన విషయాన్ని బంధువులకు తెలియజేశారు. కానీ వారు స్పందించలేదు.


దీంతో పంచాయతీ సిబ్బంది సహకారంతో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకూ ఆయన బంధువుల వద్ద ఉండేవాడని, ఇటీవల ఏ కారణం చేతనో ముదేగౌడ మఠం వద్ద కాలం వెల్లదీసేవాడని స్థానికులు తెలిపారు. ఆఖరి చూపు, అంత్యక్రియలకూ బంధువులు ముందుకు రాకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-07-20T18:13:44+05:30 IST