ప్రజల నడ్డి విరుస్తారా?

ABN , First Publish Date - 2020-12-12T04:58:03+05:30 IST

వైసీపీ ప్రభుత్వం పట్టణ ప్రజలపై పన్నుల పెనుభారాన్ని మొపుతోందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి విమర్శించారు.

ప్రజల నడ్డి విరుస్తారా?
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

  1.   ఆస్తి ఆధారంగా పన్నులు పెంచటం దారుణం
  2.   మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి 


ఎమ్మిగనూరు, డిసెంబరు 11: వైసీపీ ప్రభుత్వం పట్టణ ప్రజలపై పన్నుల పెనుభారాన్ని మొపుతోందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఎమ్మిగ నూరులో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఏలూరు వింత వ్యాధితో వందలాదిమంది అస్వస్థతకు గురైనా, చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.  విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి వెళ్లిందని, దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వానికి ప్రజారోగ్యం పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోందని అన్నారు. సంక్షేమాన్ని మరచి పట్టణ ప్రజలపై పన్నులభారం మోపి నడ్డివిరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచాలని ఏకంగా 198 జీవోను విడుదల చేసిందన్నారు. ఖాళీ స్థలాలకు కూడా పన్నులు చెల్లించాల్సి వస్తుందని, 0.1శాతం నుంచి 0.5శాతం వరకు 0.2శాతం నుంచి 2శాతం వరకు పన్నులు విధించే అవకాశం ఉందని అన్నారు. తాగునీటి పన్నులను కూడా పెంచుతూ జీవో ఇచ్చిందన్నారు. దీంతో ఆస్తి పన్ను లు  దాదాపు 15 రెట్లుపెరిగే అవకాశం ఉంటుందని, దీన్ని భరించే పరిస్థితి ప్రజలకు లేదన్నారు.  పక్క రాష్ట్రం తెలంగాణలో 50శాతం పన్నులు తగ్గించారని ఇక్కడ మాత్రం పన్నులు పెంచారని మండిపడ్డారు.


టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా పన్నులు పెంచలేదని గుర్తుచేశారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి హయాంలో ప్రారంభమైన యు జీడీ పనులను తాను ఎమ్మెల్యే అయిన తరువాత 95శాతం పూర్తిచే శానన్నారు. అనంతరం మిగతా పనులు ఎందుకు పూర్తి చేయటం లేదని ప్రశ్నించారు. అసంపూర్తి పనులతో ప్రజలు ఇబ్బంది పడుతు న్నారని, ప్రమాదాలు జరిగితే ఎవరిది బాధ్యత  అని ప్రశ్నిం చారు. కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తువస్తు న్నారని విమర్శించారు. అయితే పన్నులు ఎక్కడా పెరగలేదని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.  ప్రభుత్వం పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని బీబీ అన్నారు.  మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ కొండయ్య చౌదరి, దాదావలి, సుందరరాజు, గౌస్‌, మురళి, రాముగౌడు, మిన్నప్ప, రామకృష్ణ, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ చంద్ర, రమేష్‌, గిడ్డయ్య పాల్గొన్నారు. 


రైతుల జీవితంతో  చెలగాటమా?

 గోనెగండ్ల: గాజులదిన్నె ప్రాజెక్టు ఆయకట్టు రైతుల జీవితాలతో చెలగాటమా? అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి వైసీపీ ప్రభుత్వాని ప్రశ్నించారు. శుక్రవారం గాజులదిన్నె ప్రాజెక్టు ఆనకట్ట లీకేజీని, క్రస్ట్‌గేట్లను పరిశీలించారు. రైతు ప్రభుత్వమని వట్టి మాటలు చెప్పుకోవడం తప్ప వారికి చేసిందేమీలేదని అన్నారు. ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, అధికారులు నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు ఆనకట్టకు లీకేజి ఏర్పడిందని అన్నారు.  రైతులకు అన్యాయం జరిగితే చూస్తు ఉరుకోమని, నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలతో ఉద్యమిస్తా మన్నారు. అనంతరం ఇరిగేషన్‌ ఎస్‌ఈకి ఫోన్‌ చేసి వివరాలను తెలుసుకున్నారు. ఉల్లిగడ్డల రాముడు, నూరహమ్మద్‌, రమేష్‌నా యుడు, తెలుగుయువత నాయకులు శ్రీనివాసుల నాయుడు, తిరుపతయ్యనాయుడు, టీడీపీ నాయకులు పాల్గొన్నా రు. 


  హెచ్‌ కైరవాడి గ్రామంలో క్రికెట్‌ పోటీల విజేతలకు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి మొదటి బమమతి కోడుమూరు టీ మ్‌కు రూ.10116, రెండో బహుమతి కైరవాడి టీమ్‌కు రూ.5116 అందజేశారు.  


‘రైతు కుటుంబానికి అండగా ఉంటాం’ 

  రైతు సుభాన్‌ కుటుంబానికి అండగా ఉంటామని  టీడీపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం సుభాన్‌ భార్య, పిల్లలను పరామర్శించి, ఆర్థిక సాయం చేశారు.  వారం క్రితం అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పో యిన దాస్‌ కుటుంబానికి కూడా అర్థిక సాయం అందజేశారు. ఉల్లిగడ్డల రాముడు, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T04:58:03+05:30 IST