వడగండ్ల వాన

ABN , First Publish Date - 2020-03-21T11:22:04+05:30 IST

శుక్రవారం రాత్రి గాలి, వాన భీభత్సం సృష్టించింది. మండలంలోని నరసాపురం, ముత్తలూరు, నల్లవాగుపల్లె, తిప్పారెడ్డిపల్లె గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది.

వడగండ్ల వాన

నేల కూలిన వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు 

తడిసిపోయిన మొక్కజొన్నలు 

చీకట్లో గ్రామాలు 


రుద్రవరం, మార్చి 20: శుక్రవారం రాత్రి గాలి, వాన భీభత్సం సృష్టించింది. మండలంలోని నరసాపురం, ముత్తలూరు, నల్లవాగుపల్లె, తిప్పారెడ్డిపల్లె గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది.  మొక్కజొన్నలు తడిసి  ముద్దయ్యాయని రైతులు ఆందోళన చెందారు. వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో రుద్రవరం, కొండమాయపల్లె, కొత్తూరు, కొత్తపల్లె, నాగులవరం, ఇంకా పలు గ్రామాలు చీకట్లో ఉన్నాయి. రైతులకు తీవ్ర నష్టం కలిగింది. రుద్రవరంలో ఓ వ్యక్తికి తృటిలో ప్రమాదం తప్పింది. మిద్దెపై ఉన్న సింథటిక్‌ ట్యాంకు గాలికి ఎగిరి వచ్చి పడటంతో ప్రమాదం తప్పింది. చేతి కొచ్చిన పంట తడిసి ముద్దయిందని రైతులు వాపోయారు. 


ఆళ్లగడ్డ, మార్చి 20: ఆళ్లగడ్డ ప్రాంతంలో శుక్రవారం రాత్రి బలమైన ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. నంద్యాల రోడ్డులోని వేర్‌హౌస్‌ గోదాముల వద్ద, పాలసాగరం రోడ్డులో విద్యుత్‌ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో పట్టణంలో విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. అలాగే తహసీల్దార్‌ కార్యాలయంలో పెద్ద వేప చెట్టు నేల కూలింది. అకాల వర్షంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.


‘విద్యుత్‌ సరఫరా ఉండదు’

నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ రవికాంత్‌చౌదరి శుక్రవారం తెలిపారు. విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని కోరారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో చేపట్టే మరమ్మతు దృష్ట్యా విద్యుత్‌ సరఫరాకు అంతరాయ ఉంటుందన్నారు.

Updated Date - 2020-03-21T11:22:04+05:30 IST