మంత్రి రాజకీయం చేస్తున్నారు

ABN , First Publish Date - 2020-03-13T11:47:41+05:30 IST

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నారని ఆస్పరి టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టి.వెంకటేశ్వర్లు అన్నారు.

మంత్రి రాజకీయం చేస్తున్నారు

 ఆస్పరి జడ్పీటీసీ  టీడీపీ  అభ్యర్థి టి.వెంకటేశ్వర్లు



కర్నూలు(న్యూసిటీ), మార్చి 12: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నారని ఆస్పరి టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టి.వెంకటేశ్వర్లు అన్నారు. ఆస్పరి జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన తనపై ఆస్పరి వైసీపీ అభ్యర్థి దొరబాబు కక్షపూరితంగా తనకు నలుగురు పిల్లలు ఉన్నారని, పోటీకి అనర్హుడని రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై రిటర్నింగ్‌ అధికారిని వివరణ కోరగా చివరి సంతానానికి సంబంధించి జనన ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సూచించినట్లు తెలిపారు. 1994 పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం 1995 మే లోపల పిల్లలు  కలిగి ఉండాలని ఉందన్నారు.


అయితే పిల్లలు కలగకుండా 1994లో తన భార్య ఆపరేషన్‌ చేయించుకున్నట్లు వైద్యులు అందజేసిన పత్రాన్ని ఆర్‌వోకు అందజేశారు. తనపై క్షక్షపూరితంగా పోటీ నుంచి తప్పించాలనే ఉద్దేశంతోనే మంత్రి గుమ్మనూరు జయరాం తన అనుచరవర్గంతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని టీడీపీ అభ్యర్థి ఆరోపించారు. తాను 1999-2000 సంవత్సరంలో పాఠశాల విద్యా కమిటీలో పని చేసానని, 2001 నుంచి 2006 సర్పంచ్‌గా, 2006లో ఎంపీపీగా పని చేశానన్నారు. 2013-2018 వరకు తన సతీమణి సంజమ్మ సర్పంచ్‌గా పని చేసిన విషయాలను ఆయన వెల్లడించారు. అయితే శుక్రవారం కలెక్టర్‌కు అభ్యర్థన ద్వారా విషయాన్ని తెలియజేస్తానని ఆయన తెలిపారు. 


ఆధారాలుంటే అర్హులుగా పరిగణిస్తాం... ఎం.వెంకటసుబ్బయ్య, రిటర్నింగ్‌ అధికారి 

1994 చట్టం ప్రకారం ఆస్పరి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి దొరబాబు టీడీపీ అభ్యర్థి టి.వెంకటేశ్వర్లు జడ్పీటీసీకి అనర్హుడని ఫిర్యాదు చేశారు. టీడీపీ అభ్యర్థికి 1994 తరువాతనే చివరి సంతానం కలిగిందని, దానికి సంబంధించిన ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డులను జతపరచి లిఖితపూర్వకంగా అందజేశారు. ఈ మేరకు విచారిస్తున్నాం. వెంకటేశ్వర్లు తగిన ఆదారాలు చూపిస్తే నామినేషన్‌ను పరిశీలిస్తాం. లేని పక్షంలో కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంది. 


Updated Date - 2020-03-13T11:47:41+05:30 IST