-
-
Home » Andhra Pradesh » Kurnool » Greatly Hanuman Jayanti
-
ఘనంగా హనుమజ్జయంతి
ABN , First Publish Date - 2020-05-18T09:50:43+05:30 IST
నగరంలోని వివిధ హను మాన్, శ్రీరామాలయాల్లో ఆదివారం హనుమజ్జయంతి వేడు కలను భక్తిశ్రద్ధలతో

కర్నూలు (కల్చరల్), మే 17: నగరంలోని వివిధ హను మాన్, శ్రీరామాలయాల్లో ఆదివారం హనుమజ్జయంతి వేడు కలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు ప్రవేశం కల్పిం చకుండా వివిధ దేవాలయాల్లో అర్చకులు, పూజారుల ఆధ్వ ర్యంలో ఆంజనేయ స్వామికి సుప్రభాత సేవ, పంచామృ తాభిషేకం, అలంకార సేవ, మహానైవేద్యాలు సమ ర్పించి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. శరీన్ నగర్‌లోని సద్గురు త్యాగరాజ సీతారామాలయంలో హనుమ జ్జయంతిని భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
శ్రీశైలం: శ్రీశైల దేవస్థాన పరిధిలోని పాతాళగంగ మా ర్గంలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ఆదివారం హనుమజ్జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ జయంత్సోవ కార్యక్రమ పూజల్లో శ్రీ శైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి కేఎస్ రామరావు పాల్గొన్నారు. ఉదయం 9గం టలకు వేదపండితులు, అర్చకులు లోకకల్యాణాన్ని కాం క్షిస్తూ సంకల్పాన్ని పఠించి, మహాగణపతిపూజ నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామికి శ్రీమన్యుసూక్త సహిత అభిషేకం, నాగవల్లి, పూజనీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. లాక్‌డౌన్ వల్ల ఉత్సవానికి భక్తులను అనుమతించలేదు. కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అర్చకస్వాములు పాల్గొన్నారు.
నంద్యాల (కల్చరల్): నంద్యాల పట్టణంలోని బైటిపేటలోని ఆంజనేయకోదండరామస్వామి దేవస్థానంలో ఈవో రామంజనేయ శర్మ , సంజీవనగర్ రామాలయంలలో భగవత్‌సేవాసమాజ్ కమిటి , కాళికాంబ చంద్రశే ర స్వామిఆలయం లో ఈవో వేణునాధరెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు.
రుద్రవరం: రుద్రవరం మండలంలో ఆదివారం హనుమ జయంతి ఘనంగా నిర్వహించారు. మండలంలోని చిన్నకంబలూరు, చందలూరు, నక్కలదిన్నె, రుద్రవరం గ్రామాల్లో హనుమ జయంతిని నిర్వహించారు. చిన్నకంబలూరు గ్రామంలో హనుమంతుడికి ఆకుపూజ నిర్వహించారు.
చాగలమర్రి: చాగలమర్రి గ్రామంలోని అయ్యప్పస్వామి ఆలయంలో వెలసిన హనుమాన్ ఆలయంలో ఆదివారం యువజన సంఘం అధ్యక్షుడు పృద్వినాథ్ ఆధ్వర్యంలో హనుమజ్జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేద పండితుడు పవన్‌చే జల, క్షీరాభిషేకాలు, ఆకుపూజ చేశారు. ఆంజనేయ వ్రతాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఆర్యవైశ్యులు సత్యనారాయణ, సుబ్బారావు, లక్ష్మీనారాయణ, రంగనాథ్, మధు, శివరామ్ తదితరులు పాల్గొన్నారు.
ప్యాపిలి: పట్టణంలో ఆదివారం హనుమజ్జయంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక వెంగన్నబావి, మధ్యగేరి ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఈ వేడుకలను నిర్వహించారు.
బండి ఆత్మకూరు: మండలంలోని పెద్దదేవళపురం గ్రామ శివారులో వెలసి ఉన్న ఏక రాతిశిల అభయాంజనేయుడికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆదివారం ఆలయ నిర్వాహకుడు శివరాజునాయక్ సమక్షంలో నారపురెడ్డి అనే భక్తుడి సహకారంతో క్షీరాభిషేకం జరిగింది. అలాగే కరోనా మహమ్మారిని పారదోలాలని మృత్యుంజయ హోమం నిర్వహించారు.
బేతంచెర్ల: బేతంచెర్ల పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో, నంద్యాల రహదారిలోని పలక చింతనుమాను ఆంజనేయస్వామి దేవాలయాల్లో ఆలయ అర్చకులు హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కోడుమూరు (రూరల్): మండలంలోని వెంకటగిరిలో హనుమజ్జయంతి పురస్కరించుకుని గిడ్డాంజనేయస్వామికి విశేష పూజలు చేశారు. వేకువజామునే పూజారి తిరుమలా చార్యుల అధ్వర్యంలో ఆలయంలో పంచామృతా భిషేకం, ఆకుపూజ, అర్చన నిర్వహించారు.
ఓర్వకల్లు: మండలంలోని ఓర్వకల్లు, కన్నమడకల, పూడిచెర్ల, నన్నూరు, ఉయ్యాలవాడ, హుశేనాపురం, కాల్వ, కొమ్ముచెరువు తదితర గ్రామాల్లో ఆదివారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ఆంజనేయస్వామికి ఆకుపూజ చేశారు.