గ్రేటర్‌ రాయలసీమపై ఉద్యమం: మాజీ ఎంపీ

ABN , First Publish Date - 2020-12-15T05:32:15+05:30 IST

గ్రేటర్‌ రాయలసీమ సాధన కోసం ఉద్యమించనున్నట్లు నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి అన్నారు.

గ్రేటర్‌ రాయలసీమపై ఉద్యమం: మాజీ ఎంపీ
గ్రేటర్‌ రాయలసీమ పుస్తకాన్ని వేణుగోపాలన్‌కు ఇస్తున్న మాజీ ఎంపీ

ఆళ్లగడ్డ, డిసెంబరు 14: గ్రేటర్‌ రాయలసీమ సాధన కోసం ఉద్యమించనున్నట్లు నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి అన్నారు. సోమవారం ఆయన అహోబిలం లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో రాయలసీమ మీద పుస్తకాన్ని  ఆవిష్కరించి మొదటి కాపీని ఆలయం ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌కు అందించి ఆశీస్సులు పొందారు. గ్రేటర్‌ రాయలసీమ ఉద్యమాన్ని ప్రకాశం జిల్లా కంభం నుంచి  మొదలు పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. గ్రేటర్‌ రాయలసీమ సాధన సమితి యువ నాయకులు గంగుల భరత్‌రెడ్డి, చింతకుంట శ్రీనివాసరెడ్డి(వాసు), గంధం రాఘవరెడ్డి పాల్గొన్నారు.

Read more