ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం
ABN , First Publish Date - 2020-12-12T05:19:39+05:30 IST
ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేసిందని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి అన్నారు.
నంద్యాల టౌన్, డిసెంబరు 11: ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేసిందని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి అన్నారు. సలాం అత్త మాబున్నీషా పెద్ద కూతురి కుమార్తె రేష్మాకు పశుసంవర్థకశాఖలో డేటా ఎంట్రీగా నియమాకపత్రాన్ని కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్‌రెడ్డి అందచేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సలాం కుటుంబానికి సీఎం జగన్ అన్ని విధాలుగా సాయం చేశారన్నారు. కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల చెక్కు ఇవ్వడంతో పాటు, ఆత్మహత్యకు బాధ్యులైన సీఐ, కానిస్టేబుల్‌ను రిమాండ్‌కు పంపించారని తెలిపారు. కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సలాం కుటుంబంలోని రేష్మాకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.