-
-
Home » Andhra Pradesh » Kurnool » governament pai tdp leader somisetty fire
-
రాష్ట్రంలో రాక్షస పాలన
ABN , First Publish Date - 2020-12-29T05:19:46+05:30 IST
రాష్ట్రంలో రాక్షస పాలన పరాకాష్టకు చేరిందని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.

- సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజం
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 28: రాష్ట్రంలో రాక్షస పాలన పరాకాష్టకు చేరిందని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. సోమవారం కర్నూలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పోలీసుల వేధింపులు తట్టుకోలేక ప్రజలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని ఎదుర్కొంటుండటం దారుణమైన విషయమని ఆందోళన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తన అనుచరులతో ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి దౌర్జన్యానికి దిగడం దారుణమని, ఈ సంఘటనలో వైసీపీ ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేయకుండా పక్షపాత వైఖరి చూపారని అన్నారు.