నందికొట్కూరులో చోరీ

ABN , First Publish Date - 2020-12-10T05:39:29+05:30 IST

నందికొట్కూరు పట్టణంలోని మారుతీనగర్‌ కాలనీలో మంగళవారం రాత్రి దొంగతనం జరగింది.

నందికొట్కూరులో చోరీ

  1.  3 తులాల బంగారం, రూ.10వేల అపహరణ


నందికొట్కూరు, డిసెంబరు 9: నందికొట్కూరు పట్టణంలోని మారుతీనగర్‌ కాలనీలో మంగళవారం రాత్రి దొంగతనం జరగింది. కాలనీకి చెందిన జయమ్మ అనే మహిళ ఇంట్లో దొంగలు పడి మూడు తులాల బంగారం, రూ.10వేలు నగదు, గ్యాస్‌ సిలిండర్‌ ఎత్తుకెళ్లారు. జయమ్మ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి డ్యూటీకి వెళ్లి ఉదయం ఇంటికి వచ్చి చూసుకోగా ఇంట్లో దొంగలు జరిగినట్లు గుర్తించారు. నగలు, నగదు ఎత్తుకెళ్లారని బాధితురాలు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి డాగ్‌స్కాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. కాలనీలో ఇప్పటికి ఐదు ఇళ్లలో దంగతనాలు జరిగినట్లు కాలనీవాసులు పేర్కొంటున్నారు.  వరుస దొంగతనాలు జరుగుతుండటంతో  గురువారం నుంచి ఇంటింటి తనిఖీలు చేస్తామని సీఐ నాగరాజారావు తెలిపారు. 

Updated Date - 2020-12-10T05:39:29+05:30 IST