వాటినీ దొంగలించేశారు

ABN , First Publish Date - 2020-12-12T05:24:37+05:30 IST

మండలంలోని నరసాపురం గ్రామంలో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రేకుల షెడ్డులో ఉన్న రెండు గొర్రెలు, ఒక పొట్టేలు, ఒక గొర్రెపిల్లను ఎత్తుకెళ్లారు.

వాటినీ దొంగలించేశారు

రుద్రవరం, డిసెంబరు 11: మండలంలోని నరసాపురం గ్రామంలో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రేకుల షెడ్డులో ఉన్న రెండు గొర్రెలు, ఒక పొట్టేలు, ఒక గొర్రెపిల్లను ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం యజమాని బలరామిరెడ్డి తెల్లారి చూసేసరికి గొర్రెలు, పొటేలు, గొర్రెపిల్ల కనిపించలేదని తెలిపారు. వీటి విలువ రూ.50 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. చోరీకి పాల్పడిన వారు చెప్పలు వదిలేసి వెళ్లారు. రుద్రవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. 


Updated Date - 2020-12-12T05:24:37+05:30 IST