-
-
Home » Andhra Pradesh » Kurnool » go 77 radhu chayali
-
‘జీవో 77ను రద్దు చేయాలి’
ABN , First Publish Date - 2020-12-30T05:52:31+05:30 IST
రాష్ట్రంలోని ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, పోస్టు గ్రాడ్యుయేషన్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకార వేతనాలు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన రద్దు చేస్తూ జారీ చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐఎ్‌సఎఫ్, ఎస్‌ఎ్‌ఫఐ, పీడీఎ్‌సయూ జిల్లా కార్యదర్శులు శ్రీరాములుగౌడు, ప్రకాష్, భాస్కర్ డిమాండ్ చేశారు.

కర్నూలు(ఎడ్యుకేషన్), డిసెంబరు 29: రాష్ట్రంలోని ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్, పోస్టు గ్రాడ్యుయేషన్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకార వేతనాలు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన రద్దు చేస్తూ జారీ చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏఐఎ్‌సఎఫ్, ఎస్‌ఎ్‌ఫఐ, పీడీఎ్‌సయూ జిల్లా కార్యదర్శులు శ్రీరాములుగౌడు, ప్రకాష్, భాస్కర్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు రద్దు చేయడం సరికాదని అన్నారు. జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సూర్యప్రతాప్, మధు, చిన్న, అబ్దుల్లా, సాయి, అనిల్, చిన్న పాల్గొన్నారు.
ఆలూరు రూరల్: ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.77ను రద్దు చేయాలని డీవైఎ్‌ఫఐ మండల కార్యదర్శి మైన, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా సహాయ కార్యదర్శి గోవర్ధన్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ సర్కిల్‌లో మోకాళ్లపై కూర్చుని నిరసన చేపట్టారు. ప్రైవేట్, ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు రద్దు చేయడం సరైందికాదన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎ్‌ఫఐ మండల కార్యదర్శి వినోద్, మండల అధ్యక్షుడు రామాంజి, రవీంద్ర, రామకృష్ణ, దుర్గానాయక్, ఎస్‌ఎ్‌ఫఐ కోకన్వీనర్లు ఇందు, హేమలత, విశాలాక్షి పాల్గొన్నారు.
హొళగుంద: ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాల విద్యార్థులకు శాపంగా మారిన జీవో నం.77ను తక్షణమే రద్దు చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు నాగరాజు, రమేష్ మంగళవారం అన్నారు. తనుజ కళాశాల విద్యార్థులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.