-
-
Home » Andhra Pradesh » Kurnool » give water to kc canal
-
కేసీ ఆయకట్టుకు నీరివ్వండి: ఎస్‌ఈ లేఖ
ABN , First Publish Date - 2020-12-27T06:31:04+05:30 IST
కేసీ కెనాల్ ఆయకట్టుకు తక్షణమే నీరివ్వాల్సిన అవసరం ఉందని నీటి పారుదల శాఖ ఎస్‌ఈ శ్రీరామ చంద్రమూర్తి శనివారం ప్రభుత్వానికి లేఖ రాశారు

కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 26: కేసీ కెనాల్ ఆయకట్టుకు తక్షణమే నీరివ్వాల్సిన అవసరం ఉందని నీటి పారుదల శాఖ ఎస్‌ఈ శ్రీరామ చంద్రమూర్తి శనివారం ప్రభుత్వానికి లేఖ రాశారు. టీబీ డ్యాం నుంచి రోజూ 4 వేల క్యూసెక్కుల ప్రకారం ఆరు రోజులు 2 టీఎంసీల నీరు ఇవ్వాలని, శ్రీశైలం జలాశయం నుంచి మల్యాల లిఫ్టు ద్వారా కేసీ కెనాల్‌కు రోజూ 300 క్యూసెక్కులు ఇవ్వాలని కోరారు. భారీ వర్షాల వల్ల సాగు ఆలస్యమైందని, పంటలు చేతికి అందేందుకు ఆలస్యమతుందని, అందుకే నీరు ఇవ్వాలని ఆయన కోరారు.