-
-
Home » Andhra Pradesh » Kurnool » Girl Rape In Kurnool District
-
బాలికపై అత్యాచారం
ABN , First Publish Date - 2020-12-30T05:31:39+05:30 IST
నందికొట్కూరు పట్టణంలో ఓ బాలికపై 27వ తేదీ రాత్రి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నందికొట్కూరు, డిసెంబరు 29: నందికొట్కూరు పట్టణంలో ఓ బాలికపై 27వ తేదీ రాత్రి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తనకు కడుపునొప్పి వస్తుందని బంధువులకు చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బంధువులు మంగళవారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని, బాలికను వైద్య పరీక్షలకోసం ఆస్పత్రికి తరలించామని సీఐ నాగరాజారావు తెలిపారు.