జీడీపీ ఆనకట్ట పెంపునకు ప్రతిపాదనలు

ABN , First Publish Date - 2020-12-11T05:47:59+05:30 IST

గాజులదిన్నె ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు పెంచేందుకు రూ.70 కోట్లతో ప్రతిపా దనలు పంపినట్లు జీడీపీ ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.

జీడీపీ ఆనకట్ట పెంపునకు ప్రతిపాదనలు
గాజులదిన్నె ప్రాజెక్టు

అదనంగా మరో టీఎంసీ నిల్వ సామర్థ్యం


గోనెగండ్ల, డిసెంబరు 10: గాజులదిన్నె ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు పెంచేందుకు రూ.70 కోట్లతో ప్రతిపా దనలు పంపినట్లు జీడీపీ ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుత ఆనకట్టను మరో మీటరు ఎత్తు పెంచాలని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం జీడీపీ నీటి నిల్వ సామర్థం 4.4 టీఎంసీలు కాగా.. ఎత్తు పెంచితే మరో టీఎంసీ నిల్వ చేయవచ్చని చెబుతున్నారు. దీంతో మరో పదివేల ఎకరాలకు సాగునీరు అందించడమే గాక చాలా గ్రామాలు, పట్టణాలకు తాగునీటిని సరఫరా చేయవచ్చు. అయితే జీడీపీలో ఇప్పటికే 377 మీటర్ల వరకు నీరు నిల్వ చేస్తే ఐరన్‌బండ, గంజహళ్లి, బెల్లందొడ్డి గ్రామాల పంట పొలాలు మునిగిపోతున్నాయి. ఇలాంటి ఇబ్బందులు ఉన్న చోట ప్రహరీ నిర్మిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జీడీపీ అఽఽధికారులు జిల్లా కేంద్రం జలమండలి అధికారులతో గురువారం చర్చించారు. 

Updated Date - 2020-12-11T05:47:59+05:30 IST